4 July, 2026 | 6:06 PM

మెట్ పల్లిలో దొడ్డి కొమురయ్యకు నివాళులు

04-07-2026 04:29 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య ఎనభైవ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్ దొడ్డి కొమరయ్య  విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన త్యాగాలను తెలంగాణ ప్రజలు మరవరని తెలిపారు. పట్టణ కుల సంఘాల డిమాండ్ మేరకు ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేసి,అలాగే కురుమ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలనె వారి డిమాండ్లు ఉన్నత అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.