15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

14-04-2026 01:22 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, సమానత్వానికి ప్రతీక, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మంగళవారం టేకులపల్లి మండలం సులానగర్ గ్రామంలో, టేకులపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

అనంతరం టేకులపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రోడ్డు ప్రమాదాలు నివారణ  (road safety ) ARIVE ALIVE CAMPAIGN  ప్రోగ్రాం టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ ల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు నుండి సులానగర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల  నివారణకు వాహనాదారులు సహకరించాలని, హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణ ఉంటుందని, ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి రోడ్డు సేఫ్టీ నిబంధనలను పాటించాలని కోరుతూ పలువురికి హెల్మెట్ లను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లీశ్వరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవా నాయక్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.