రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): జిల్లా రవాణా అధికారి (డిటిఓ) సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచనల మేరకు నాగిరెడ్డిపేట్ ప్రభుత్వ కళాశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట రామ్ రెడ్డి అద్వర్యంలో జరగిన ఈకార్యక్రమానికి రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహాయక మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు కె.ఉదయ్ కుమార్, మహమ్మద్ రఫీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఏఎంవిఐ కె.ఉదయ్ మాట్లాడుతూ.. "నిర్లక్ష్యం కారణంగా, అవగాహన లేమి వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 18 సం,,లోపు యువకులు వాహనాలు నడుపవద్దని, ట్రిపుల్ రైడింగ్ లాంటివి మానుకోవాలని హెచ్చరించారు.ఇంట్లో కుటుంబసభ్యులతో చర్చించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచి రహదారి భద్రతలో భాగస్వాములు కావాలని కోరారు.
ఏఎంవిఐరఫీ మాట్లాడుతు...ఆటో రిక్షాలో పరిమితికి మించి ప్రయాణం చేయరాదు. పిల్లలు వారి తల్లితండ్రులు ఇది తప్పకుండా గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామ్ రెడ్డి మాట్లాడుతూ... పిల్లలు అధికారులు చెప్పినటువంటి సూచనలను పాటించి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






