22 July, 2026 | 2:36 AM

చర్లలో ‘నేరుగా విత్తేవరి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం

22-07-2026 01:52 AM

చర్ల, ట్రాక్టర్ జూలై 21,( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లెనిన్నగర్, ఉంజుపల్లి, దోసిల్లపల్లి , దేవరపల్లి గ్రామాల్లో భారతీయ వరి పరిశోధనా సంస్థ - ఐ కార్ - ఐ ఐ ఆర్ ఆర్ , హైదరాబాద్ మరియు ఎస్బీఐ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘నేరుగా విత్తే వరి సాగు - డైరెక్ట్ సీడెడ్ రైస్ - డి ఎస్ ఆర్ ‘ పై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ వరి పరిశోధనా సంస్థ రీసెర్చ్ అసోసియేట్ డా. ఎస్. కవి రాజు మాట్లాడుతూ నేరుగా విత్తే వరి సాగు పద్ధతి, విత్తన శుద్ధి, కలుపు నివారణ, నీటి యాజమాన్యం గురించి రైతులకు వివరించారు. ఎల్నినో పరిస్థితుల్లో ఈ పద్ధతి వల్ల నీటి వినియోగం,

సాగు ఖర్చులు తగ్గడంతో పాటు స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. కరువు ముప్పు ఉన్నందున రైతులు అరుతడుల నీటి పారుదల పద్ధతులను పాటించాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ఆఫ్రిద్ మహమ్మద్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా డి ఎస్ ఆర్ వంటి ఆధునిక సాంకేతికతలను రైతులు స్వీకరించాలని కోరారు. శిక్షణ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ పద్ధతిని తమ పొలాల్లో అమలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు