తక్షణమే కొత్తగూడెంలో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మించాలి
బీజేపీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు శీలం విద్యాసాగర్
కొత్తగూడెం టౌన్, జూలై 21 ( విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు శీలం విద్యాసాగర్ కోరారు. మంగళవారం కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజలక్ష్మినీ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శీలం విద్యాసాగర్ మాట్లాడుతూ, కొత్తగూడెం ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రస్తుత ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందన్నారు. భవనం పైకప్పులు దెబ్బతినడం, గోడలు పాడవడం, వర్షపు నీరు కారడం, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గొడవలు కొట్టడం శిధిలావస్థకు చేరుకున్న బస్టాండ్ ద్వారా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందని భయాందోళన వ్యక్తం చేశారు. సౌకర్యాలతో కూడిన నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అవసరమైన నిధులు మంజూరు చేసి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ సీనియర్ నాయకులు నాగేశ్వరావు, రాజమౌగిలి, రాములు నోముల రమేష్, తదితరులు పాల్గొన్నారు.






