8 May, 2026 | 4:15 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

స్వీయ జనగణనపై అవగాహన

08-05-2026 03:36 PM

- ప్రజలు భాగస్వాములు కావాలి.

- మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి.

చేవెళ్ల మే 8(విజయక్రాంతి): స్వీయ జనగణనపై అవగాహన కమీషనర్ యాదగిరి అధ్యక్షతన చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమత వెంకటరెడ్డి హాజరవ్వగా సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ... స్వీయ జనగణనలో ప్రజలు భాగస్వాములు కావాలని  పిలుపునిచ్చారు. జాతీయ జనగణన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చేవెళ్ల పురపాలక సంఘం పరిధిలో "స్వీయ జనగణన" పై విస్తృత అవగాహన నిర్వహించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ జనగణన పద్ధతి ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో శంకరపల్లి చౌరస్తా, బస్టాండ్ ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి బ్యానర్లు ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు. ప్రజలు సులభంగా వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రకటన పత్రాలపై ముద్రంచిన QR కోడ్‌లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పద్ధతి ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా, తప్పులు లేకుండా ఖచ్చితమైన గణాంకాలు నమోదవుతాయని పేర్కొన్నారు.

ప్రజలు బాధ్యతగా ఈ జనగణనలో పాల్గొని దేశాభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌసిలర్ కరికే మీనాక్షి సత్యనారాయణ, 5వ వార్డు కౌసిలర్ దేవులపల్లి శ్రీనివాస్ రెడ్డి,12వ వార్డు కౌసిలర్ దేవరి మనీషా అనంత్ రెడ్డి,14వ వార్డు కౌసిలర్ మద్దెల శ్రీనివాస్, 15వ వార్డు కౌసిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి. మున్సిపల్ వార్డు ఆఫీసర్లు, సిబ్బంది మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.