8 July, 2026 | 8:36 PM

Breaking News

పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి   •   ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •  

ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి

08-05-2026 03:34 PM

ప్రతి పంచాయతీలో కనీసం 150 మంది పనికి రావాలి

డీఆర్‌డీవో దత్తారావు

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఉపాధి హామీ పనుల్లో కార్మికుల హాజరు పెంచి, ప్రతి కూలీకి కనీసం రూ.300 వేతనం వచ్చేలా పనులు నిర్వహించాలని డీఆర్‌డీవో దత్తారావు సూచించారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న ఫ్లడ్ డైవర్షన్ డ్రెయిన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడిన ఆయన పంచాయతీలోని ప్రతి కార్మికుడు ఉపాధి హామీ పనులకు హాజరై పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరారు. సగటు వేతనం కనీసం రూ.300 వచ్చే విధంగా పనుల ప్రణాళిక ఉండాలని తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 150 మంది కార్మికులు పనులకు వచ్చేలా లేబర్ ఇంప్రూవ్‌మెంట్ చర్యలు చేపట్టాలని క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులను ఆదేశించారు. పనుల నాణ్యతతో పాటు కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ సంగీత లచ్చన్న, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.