8 May, 2026 | 4:31 PM

పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు

08-05-2026 03:37 PM

వ్యాధుల నివారణకు మందుల పంపిణి చేసిన పశువైధ్యులు డా. శిరీష.

చేవెళ్ల మే 08(విజయక్రాంతి): ప్రజా పాలన రైతు వారోత్సవాలలో భాగంగా చేవెళ్ళ మండల పరిధిలోని ప్రాథమిక పశువైద్య కేంద్రం పల్గుట్ట వెటర్నరీ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో అల్లవాడ గ్రామంలో శుక్రవారం ఉచిత పశు వైద్య  శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ జుట్టు లావణ్య యాదయ్య ఉపసర్పంచ్  మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం డా. శిరీష ప్రకటన విడుదల చేశారు.

గ్రామాలలో పశుపోషణ రైతుకు ఆదాయ వనరులని సన్నాజీవాలు పాడి పశువుల ఆరోగ్య పట్ల రైతులు అశ్రద్ధగా ఉండకూడదన్నారు. గ్రామంలో 19 దూడలకు నట్టల నివారణకు మందులిచ్చారు. 38 పశువులకు గర్భకోస వ్యాధి చికిత్స నిర్వహించి 136 మేకలకు నట్టల నివారణ మందులిచ్చారు. గోమార్లు పిడుదుల నిర్మూలనకు రైతులకు మందులు పంపిణీ చేశారు. 75 శాంతం సబ్సిడీతో రైతులకు గడ్డి విత్తనాలు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో డా. వి శిరీష, విఏఎస్ పలుగుట్ట డా.  దేవేందర్ రెడ్డి  విఏఎస్ ఆలూరు,  ఏఈఓ బాలకోటేశ్వర్, ఎల్ఎస్ఏలు శ్రీనివాస్,  గిరీశ్వర్, గోపాలమిత్ర నరేష్, రాజేష్ ,  అటెండర్ దేవేందర్, అశోక్, రైతులు పాల్గొన్నారు.