15-02-2026 12:00:00 AM
శంషాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతి నగర్లో సైబర్ నేరాలపై ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఓటీపీ మోసాలు,నకిలీ కాల్స్,ఆన్లైన్ ఫ్రాడ్లపై జాగ్రత్తలను తెలియజేప్పారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేయొద్దని, అలాంటి లింక్ లను ఓపెన్ చేస్తే అనవసరమైన సైబర్ నేరాల్లో చిక్కుకొంటారన్నారు.
అదేవిధంగా అనుమానస్పదంగా ఎవరైనా కాలనీలో సంచరిస్తున్నా, అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్న వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేయడంతో పాటు 1930 హెల్ప్లైన్కు సమాచారం అందించాలని సూచించారు. ఎలాంటి నేరాలనైనా అదుపు చేసేందుకు, ప్రజలకు సహకరించేందుకు పోలీసు అధికారులు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.