calender_icon.png 15 February, 2026 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి

15-02-2026 12:00:00 AM

వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

హైదరాబాద్ సిటీ బ్యూరో/పంజాగుట్ట ఫిబ్రవరి 14 (విజయ క్రాంతి): సనత్ నగర్ నియోజకవర్గం ఎస్‌ఆర్ నగర్ డివిజన్ బాపునగర్లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయం తి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మం నిర్వాహకులు రవికిరణ్, బాలు నాయ క్, తరుణ్ జాదవ్ ఆహ్వానం మేరకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.

అనంతరం డాక్టర్ కోటనీలిమ మాట్లాడుతూ.. యావత్ దేశం గర్వించదగ్గ ఆధ్యా త్మికవేత్త సంత్ సేవాలాల్ మహరాజ్ అని అన్నారు. సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమం లో అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్.ఎస్. రావు, శ్రీకాంత్ యాదవ్, పద్మావతి, పింకీ భాయ్, మదన్ సింగ్, ప్రతాప్ నాయక్, కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిమ్స్‌లో..

సేవలాల్ మహారాజ్ 287వ జయంతిని పురస్కరించుకొని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో జరిగాయి. నిమ్స్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాత భవనంలోని లెర్నింగ్ సెంటర్లో శనివారం నిర్వహిం చిన ఈ కార్యక్రమానికి నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప ముఖ్య ఆహ్వాని తులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్, ప్రముఖ వైద్యులు భూష ణ్ రాజు, గంగాధర్, వంశీకృష్ణ, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యగౌడ్, అసోసియేషన్ అధ్యక్షురాలు కేజియా, సభ్యులు బిడుగు శేఖర్, సేవలాల్ తదితరులు పాల్గొన్నారు.