calender_icon.png 15 February, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ చికిత్సలో ఖచ్చితత్వం-, కరుణ ముఖ్యం

15-02-2026 12:00:00 AM

బంజారాహిల్స్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): అంతర్జాతీయ చిన్నపిల్లల క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. శనివారం నిర్వహిం చిన కార్యక్రమంలో వైద్య నిపుణులు కీలక ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీఈఓ డాక్టర్ కె. కృష్ణయ్య మాట్లా డుతూ బాల్య క్యాన్సర్ సంరక్షణకు కేవలం వైద్యం మాత్రమే సరిపోదు, దానికి ఖచ్చితత్వం, కరుణ అందరి సహకారం అవసరమన్నారు.

భారతదేశంలో పటిష్టమైన పీడియాట్రిక్ ఆంకాలజీ విధానాలను నిర్మించడంలో ఈ శిక్షణా కార్యక్రమం ఒక కీలక అడుగు అని అభివర్ణించారు. అనంతరం మెడికల్ ఆంకాలజీ హెచ్‌ఓడి డాక్టర్ సెంథిల్ జె. రాజప్ప మాట్లాడుతూ ఈ కార్యక్రమం సాధారణ ఉపన్యాసాలకే పరిమితం కాకుం డా వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లపై దృష్టి సారించిందని తెలిపారు. కార్యక్ర మంలో వర్క్‌షాప్ రూపకర్త, పీడియాట్రిక్ ఆంకాలజీ ఇన్-చార్జ్ డాక్టర్ వీరేంద్ర పాటిల్, డాక్టర్ కల్పన రఘునాథ్, డాక్టర్ ఫణి కోటేశ్వరరావు, డాక్టర్ ఎంవిటి కృష్ణ మోహన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.