7 July, 2026 | 3:57 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన

01-01-2026 02:32 AM

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): మండలంలోనీ మాల్తుమ్మెద గ్రామంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మి్ంప రైతులకు అవగాహన సమావేశం గ్రామీణ రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం, మట్టి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్  పథకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు బుధవారం రైతుల అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రసాయన ఎరువులు,పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సహజ వనరుల ఆధారిత వ్యవసాయం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. ముఖ్యంగా సహజ వ్యవసాయ విధానాలు, జీవామృతం, ఘనజీవామృతం తయారీ విధానాలు, దేశీ ఆవుల ప్రాముఖ్యత, మట్టిలో సూక్ష్మజీవుల పాత్ర,పంట వ్యయాలు తగ్గించి లాభాలు పెంచుకునే మార్గాలు వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.  రైతులు పంట వ్యర్ధాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ఏడీఏ ఎల్లారెడ్డి  సుధా మాధురి,రైతు విజ్ఞాన కేంద్రం మాల్తుమెద శాస్త్రవేత్త అనిల్ రెడ్డి,ఏవో  సాయికిరణ్, ఏఈఓ ప్రశాంత్ కుమార్, సర్పంచ్ సాయిలు, రైతులు  పాల్గొన్నారు.