13 April, 2026 | 2:27 AM

ఇద్దరు కవులకు పురస్కారం

13-04-2026 12:56 AM

ప్రముఖ కవి, రచయిత స్కైబాబా ఈ నెల ౧౮న మహారాష్ట్రంలోని పునా నగరంలో బాబుమియా బ్యాండ్ వాలే జాతీయ సమైక్యతా పురస్కారం అందుకోనున్నారు. ముస్లిం సత్యశోధక్ మండల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. 

‘మరువం మాటల వేదిక’ ఆధ్వర్యంలో నెలలో రెండుసార్లు నిర్వహిస్తున్న ‘ధ్వని’ సాహితీ కార్యక్రమంలో భాగంగా ఈనెల ౧౬వ తేదీ రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌లోని లామాకాన్‌లో ప్రముఖ కవి, రచయిత రావులపాటి సీతారాం స్వీయ కవితా పఠన కార్యక్రమం జరుగనుంది. అలాగే, రావులపాటి సీతారాం ఈ నెల ౩౦న హైదరాబాద్‌లోని తెలంగాణ సారసత్వ పరిషత్ భవనంలో చింతలపల్లి నారాయణరావు జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. కార్యక్రమానికి సాహితీవేత్తలు, సాహితీ అభిమానులందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.