22 August, 2026 | 11:58 PM

24న ఆటోల బంద్

22-08-2026 11:00 PM

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఈ నెల 24న ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ బక్కన్న కు తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసమే ఆటోల బంద్ చేపట్టామని తెలిపారు. తమ ఆందోళనకు ప్రజలు, ఇతర వర్గాల వారు సహకరించాలని జేఏసీ నాయకులు కోరారు.