అక్కంపల్లిలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన డీపీవో
22-08-2026 10:57 PM
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని అక్కంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను డీపీవో మురళి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.గ్రామస్తులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీడీవో గంగాధర్‌కు సూచించారు. ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేలా బోరుబావుల వద్ద రీఛార్జ్ బిట్లు,ఫార్మ్ పాండ్స్ వంటి రైతులకు ఉపయోగకరమైన పనులను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకగౌడ్,ఈజీఎస్ ఏపీవో సక్కుబాయి, ఎంపీఓ ప్రభాకర్‌చారి తదితరులు పాల్గొన్నారు.






