23 August, 2026 | 12:51 AM

పోలీస్ శాఖకు రాజ బహుదూర్ వెంకటరామిరెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం

22-08-2026 11:58 PM

టీ ఎస్ పి ఎ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.కె ప్రసాద్

 ఘనంగా 157 జయంతి వేడుకలు

రాజేంద్ర నగర్,(విజయక్రాంతి): రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి 157వ జయంతి వేడుకలను రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం ఘనంగా నిర్వహించారు. అకాడమీ అధికారులు, ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థకు వెంకట రామిరెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని, పేదలు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ఆర్‌బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు కొండ లక్ష్మీకాంతరెడ్డి విద్యారంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. రిటైర్డ్ అదనపు ఎస్పీ తిరుపతిరెడ్డి ఆయన పోలీసింగ్ విధానం, ప్రజా సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రత్యేక అతిథులకు అకాడమీ తరఫున జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అకాడమీ అధికారులు, డీఎస్పీలు, ఆర్‌ఐలు, సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.