6 May, 2026 | 11:40 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఆటోడ్రైవర్‌లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

29-11-2025 01:05 AM

సీఐ శివ శంకర్

నారాయణపేట, నవంబర్ 28 (విజయక్రాంతి) : ఆటో డ్రైవర్లు ట్రాఫికీ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను, విద్యార్థులను, కూలీలను ఎక్కించుకోరాదని, వాహ నాలకు సంబంధించిన పత్రాలను కల్గి ఉండాలని సీఐ శివ శంకర్ తెలిపారు. పెరపళ్ళ నుండి నారాయణపేట టౌన్‌కి వస్తున ఆటోలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను, ప్రయాణికులను పరిమితికి మించి తీసుకెళ్తు ఆటోను ప్రమాదకరంగా నడుపుతున్న ఆటో డ్రైవర్ను సిఐ శివ శంకర్, ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణ చైతన్య, రూరల్ ఎస్‌ఐ రాముడు లు పట్టుకొని పోలీసు స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు.

ఆటో డ్రైవర్ లైసెన్స్ లేకుండా, పరిమితి కంటే ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులు, ప్రయాణికులను ఎక్కించుకొని రోడ్డుపై నిర్లక్ష్యంగా నడుపుతున్నట్టు గుర్తించారు. విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే ఈ రకమైన నిర్లక్ష్యాన్ని అస్సలు సహించబోమని సిఐ అన్నారు. ఇలాంటి ప్రమాదకర చర్యలు భవిష్యత్తులో పునరావృతం చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆటోలలో పరిమితికి మించి పంపారాదు అని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు.