11 March, 2026 | 3:15 AM

గోదావరి పుష్కరాలపై సమీక్ష

11-03-2026 01:28 AM

నిర్మల్, మార్చి 10(విజయక్రాంతి): రానున్న గోదావరి నది పుష్కరాలకు సంబంధించి జిల్లాలో ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులతో వారి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనుల గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం లో డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్వో రాజేందర్, వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరు లు పాల్గొన్నారు.