26 August, 2026 | 4:05 AM

వ్యాపార దుకాణాలకు వేలంపాట

25-08-2026 10:16 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో వ్యాపార దుకాణాలకు వేలంపాట నిర్వహిస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్ తెలిపారు. గల ఎస్సీ కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 4, 5, 10 నంబర్ల దుకాణాలను నెలవారీ కిరాయికి ఇవ్వడానికి బహిరంగ వేలం వచ్చే నెల సెప్టెంబర్‌ 1న ఉదయం 11.30 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వేలంలో పాల్గొనే ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు రుసుము చెల్లించి, నిర్ణీత దరఖాస్తును ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వేలంలో పాల్గొనే వారు కుల, ఆదాయ, రేషన్‌ కార్డు, నివాస, ఆధార్‌ తదితర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌ ప్రతులతో పాటు రూ.50 వేల ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందని, వేలంలో దుకాణం దక్కిన వారు  నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు.