బీఆర్‌ఎస్ నాయకులపై దాడులకు పాల్పడితే సహించేది లేదు
- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్
- కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ బీఆర్‌ఎస్ కార్యకర్తకు పరామర్శ
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఆగస్టు16: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో కక్షలు,కార్పన్యాలు పెరిగాయని,గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతూ అరాచకం సృష్టిస్తున్నారని,బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే సహించే ప్రసక్తే లేదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ యువజన నాయకుడు గుణగంటి చంద్రకాంత్ గౌడ్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరచగా ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆదివారం తిమ్మాపురం గ్రామంలోని తన నివాసంలో ఆయనను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని,దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేయాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని,స్థానిక సీఐ,ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
గడిచిన పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు,అల్లర్లు లేవని ప్రశాంతంగా ఉన్న పల్లెలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.అనంతరం తక్షణ సహాయంగా రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేసి,కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేశ్ గౌడ్,బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ రఘునందన్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్,మాజీ వైస్ ఎంపీపీ మారిపెద్ది భవానీశ్రీనివాస్ గౌడ్,మొరిశెట్టి ఉపేందర్,సర్పంచులు బొడ్డు ఇందిరాసోమరాజు,కర్నాటి వెంకన్న,నున్న యాదగిరి,మేడి వీరస్వామి,కొమ్మినేని సతీష్,కందుల దశరథరామారావు,చల్లా వేణుధర్ రెడ్డి,జీడి ఉపేందర్,లింగమూర్తి,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






