21 April, 2026 | 7:36 PM

డ్యూటి కానిస్టేబుల్ పై దాడి

21-04-2026 06:25 PM

మోతె,(విజయక్రాంతి): డ్యూటీ కాని స్టేబుల్ పై దాడి ఘటన సోమవారం రాత్రి  సుమారు 8 గంటల సమయంలో జరిగింది. తహసీల్దార్ వెంకన్న, యస్ఐ అజయ్ కుమార్ ల ఆదేశానుసారంగా  కూడలి జిపిఓ సుధాకర్, మోతె పోలీస్ కానిస్టేబుల్ కృష్ణం రాజు పీకేట్ నిర్వహిస్తుండగా ఇసుక అక్రమ రవాన జరగకుండా సూర్యాపేట, ఖమ్మం జిల్లా ల మధ్య పీకేట్ నిర్వహించడం జరుగుతుందని యస్ ఐ అజయ్ కుమార్ చెప్పారు.

కాకరవాయి నుండి కూడలి వైపు గా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ను ఆపగా ట్రాక్టర్ డ్రైవర్ తన ట్రాక్టర్ ను ఆపకుండా అతి వేగంతో నడుపగా కాని స్టేబుల్ తన బైక్ పై ఛేదించి ట్రాక్టర్ ఇసుక రవాణా కు సంబంధించి కాగితాలు అడుగగా డ్రైవర్ కాగితాలు చూపకుండా తన తో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు విధులలో ఉన్న కాని స్టేబుల్ ను ముగ్గురు కలిసి చేతులతో కొట్టి దాడి చేసి కింద పడేసి ట్రాక్టర్ తో పారి పోయారు.

వెనుక నుంచి మరో వ్యక్తి కారులో వచ్చి నేను సోలిపురం గ్రామ సర్పంచ్ ని ట్రాక్టర్ ఎందుకు ఆపుతున్నవని దురుసుగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మోతె యస్ ఐ అజయ్ కుమార్ విచారణ జరిపి కాని స్టేబుల్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. భూక్యా మధు గ్రామం రాయికుంట తండ, భూక్యా శ్రీకాంత్ గ్రామం రాయకుంటతండ, నునవత్ అశోక్ సోలిపురం ల పై కేసు నమోదు చేసినట్లు మోత ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు.