23 July, 2026 | 12:56 AM

జీఎస్టీ అప్పీళ్లకు నిష్పాక్షిక విచారణ హామీ

23-07-2026 12:00 AM

న్యాయమూర్తి సుశీల్ కుమార్ శర్మ వెల్లడి

ముషీరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): జీఎస్టీ కేసుల పిటిష న్లు, అప్పీళ్లకు నిష్పాక్షిక విచారణకు జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ కట్టుబడి ఉందని తెలంగాణ జీఎ స్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి సుశీల్‌కుమార్ శర్మ తెలి పారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లక్డికాపూల్ ఎఫ్ టీసిసి ఆడిటోరియంలో తెలంగాణ, ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్టెడ్  అకౌంటెంట్లు, పన్ను న్యాయవాదులకు  నిర్వహించిన ’ఓపెన్ ఫోరమ్ విత్ జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్’లో ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అన్ని అప్పీళ్లను జీఎస్టీఏటీ పోర్టల్లో ఏపీఎల్-05 ద్వారా ఈ-ఫైలింగ్ చేయాలని తెలిపారు.

చిన్న సాంకేతిక లోపాల కారణంగా అప్పీళ్లను తిరస్కరించబోమని అన్నారు. అవసరమైతే గడువుల పొడిగింపు, సాక్షుల విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్కు ట్రిబ్యునల్కు అధికారాలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో రవి, డా.శ్రీనివాస్, అవధేశ్ ప్రసాద్ దాహిమ, నారాయణరావు, రాందే వ్ బుతాడా, చంద్రశేఖర్, హితేష్ జైన్, మధుసూదన్, పంకజ్ సంచేటి, కోట ఆదినారాయణ, ప్రవళిక వేముల, ఆశిష్ జోషి, లీల కృష్ణ మోహన్, సోమేశ్వర్ నేమాని, చారి పాల్గొన్నారు.