బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా అరవింద్ రెడ్డి ఎన్నిక
28-05-2026 01:01 AM
అడ్డాకుల, మే 27: మండలం చిన్న మునగల్చేడ్ గ్రామానికి చెందిన అరవింద్ రెడ్డికి బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేవైఎం కార్యదర్శిగా ఎన్నికైన అరవింద్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బీజేవైఎం కార్యదర్శిగా ఎన్నికలు చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీనీ బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని నాతోటి యువకులను కలుపుకొని పోయి అందరికీ సముచిత న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు అరవింద్ రెడ్డి బీజేవైఎం తెలంగాణ రాష్ట్రం నూతన కమిటీ లో చోటు దక్కడంతో పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.






