27 February, 2026 | 1:47 PM

కన్నీటిపర్యంతమైన కేజ్రీవాల్.. మోదీపై కీలక వ్యాఖ్యలు

27-02-2026 12:32 PM
  1. మాజీ సీఎం, డిప్యూటీ సీఎంకు భారీ ఊరట
  2. కేజ్రీవాల్ ఏనాడు అవినీతికి పాల్పడలేదు
  3. అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లం మేము
  4. కేవలం విపక్షాలపైనే ప్రధాని దృష్టి
  5. మోదీ ప్రజల సమస్యలను పట్టించుకోరు

న్యూఢిల్లీ: రాజకీయంగా సంచలనం సృష్టించిన మద్యం పాలసీ కేసులో తనపై ఉన్న అవినీతి కేసు స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద రాజకీయ కుట్ర అని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal ) శుక్రవారం ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. తీర్పు వెలువడగానే, మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన విలేకరుల ముందు విలపించారు. కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, ఆప్‌ ‘కత్తర్‌ ఇమాందర్‌’ అని కోర్టు రుజువు చేసిందని ఆయన అన్నారు.

ఢిల్లీ మద్యం విధానం(Delhi Liquor Policy) సీబీఐ కేసులో ఆఫ్ అధినేత కేజ్రీవాల్(AAP chief Kejriwal)కు భారీ ఊరట లభించింది. మద్యం కేసులో కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, దుర్గేశ్ పాఠక్ కోర్టుకు హాజరయ్యారు. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కవిత(Kalvakuntla Kavitha) పేర్లను డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ మీడియా ముందు కన్నీటిపర్యంతమైయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారని కేజ్రీవాల్ వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం సహా ఐదుగురిని జైల్లో పెట్టారు. కేజ్రీవాల్ ఏనాడు అవినీతికి పాల్పడలేదని ఆయన వివరించారు. కేవలం విపక్షాలపైనే ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దృష్టి పెట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజల సమస్యలను ప్రధాని  ఏమాత్రం పట్టించుకోరని మండిపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడామని పేర్కొన్నారు.