18 April, 2026 | 4:11 AM

ఆర్టిజన్ల సమ్మె విరమణ

18-04-2026 12:00 AM
  1. సమస్యల పరిష్కారానికి సీఎండీతో చర్చలు
  2. ప్రజలను మెప్పించే పనులు చేయాలి
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): ఆర్టిజన్లు సమ్మెను వివరించారు. డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్కతో శుక్రవారం ప్రజాభవన్‌లో ఆర్జిజన్ జేఏసీ నాయకులు సమావేశ మై.. తమ సమస్యలను వివరించారు. ఈ స మస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు ట్రాన్స్‌కో సీఎండీతో చర్చించాలని డిప్యూటీ సీఎం భట్టి  సూ చించారు. దీంతో సమ్మె విరమించాలని నిర్ణ యం తీసుకున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్ సతీష్‌రెడ్డి ప్రకటించారు.

తమ సమస్యల పట్ల సా నుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించిన డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆర్టిజన్ల జేఏసీ కన్వీనర్ సాయిలు ప్రకటించారు. ఈ  సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మా ట్లాడుతూ ఉద్యోగులు ప్రజలను మెప్పించే ప నులు చేయాలని సూచించారు. సమ్మెపై బ్యా న్ ఉన్నదని తెలిసి, వేసవిలో విద్యుత్తు డిమాం డ్ పీక్ స్థాయిలో ఉంటుంది ఈ సమయంలో అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం సరైనది కాదని డిప్యూటీ సీఎం తెలిపారు. చర్చల ద్వారానే స మస్యల పరిష్కారం అవుతాయన్నారు.

ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం చర్చలు చేస్తుంది, వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతుందని జే ఏసీ నాయకులకు డిప్యూటీ సీఎం గుర్తు చేశా రు. ఆర్థిక భారం లేకుండా మానవీయ కోణం లో పరిష్కరించగలిగే సమస్యలపై ఆర్టిజన్లు జేఏసీతో ట్రాన్స్‌కో  సీఎండీ చర్చలు జరుపుతారు.

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. చర్చల్లో ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ల కో చైర్మన్లు చంద్రారెడ్డి, శ్రీధర్‌గౌడ్, చందర్ సింగ్ ఠాకూర్, వైస్‌చైర్మన్ సంతోష్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.