24 July, 2026 | 9:38 PM

ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు

24-07-2026 08:41 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య తెలిపారు. ఆయన శుక్రవారం నాడు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ... నిజాంసాగర్ప్రాజెక్టు వద్దా నిర్మిస్తున్న కాటేజీల్లో రూ.1.75 లక్షల విలువైన వస్తువుల చోరీ కేసులో  ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల గోల్ బంగ్లా సమీపంలో నిర్మాణంలో ఉన్న కాటేజీల్లో జరిగిన చోరీ కేసును నిజాంసాగర్ పోలీసులు చెందించారు.

ఈ ఘటనపై కాటేజీ సూపర్వైజర్  అందె మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి బాన్స్వాడ డీఎస్పీ  విఠల్ రెడ్డి పర్యవేక్షణలో, బాన్స్వాడ రూరల్ సీఐ ఎ. తిరుపయ్య  శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారన్నారు.

ఏ 1: గట్టు రాకేష్, (29), 

ఏ 2: తమ్మినేని లక్ష్మణ్ రావు @ శివ, (25), 

నిందితుల వద్ద నుండి,రెండు కట్టర్లు,రెండు వెల్డింగ్ మిషన్లు,ఒక WUKO CLIPPER బాక్స్,మారుతి రిట్జ్ కారు (AP09CM6006,- రెండు మొబైల్ ఫోన్లు మొత్తం సుమారు రూ.1.75 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించి నట్టు అయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశం లో నిజాంసాగర్ ఎస్సై శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.