6 May, 2026 | 4:28 AM

ఆటోడ్రైవర్ల హామీలను అమలు చేయాలి

06-05-2026 02:56 AM

ధర్నాచౌక్‌లో ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల మహాధర్నా

ముషీరాబాద్, మే5 (విజయక్రాంతి): ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, గత ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బిపిటిఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి, తెలంగాణ స్టేట్ ఆటో టాక్సీ డ్రైవర్స్  యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.  పెంటయ్య గౌడ్ లు పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్  మహా సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో ఆటో ప్రైవేట్ రవాణా కా ర్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు ముఖ్య అతిధులుగా హాజరైన రవిశంకర్ అల్లూరి, బి.పెంటయ్యగౌడ్‌లు మాట్లాడు తూ అక్రమంగా నడుస్తున్న ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్‌లను నిషేదించాలని, ఆర్టీఏ దళారుల ద్వారా జరుగుతున్న దోపిడిని అరికట్టాల ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ మహాధర్నాలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె శ్రీధర్ రెడ్డి, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యకుడు చింతల నందకిషోర్, రాష్ట్ర టిఎస్పిటీ టిఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు లికిత్ కుమార్, ఉపాధ్యక్షులు హబీబ్, క్యాబ్ యూనియన్ నాయకులు సంతోష్ మీనా, గ్రేటర్ ఆబోయూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.