24 March, 2026 | 7:44 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •   కల్లూరు నుండి హైదరాబాద్‌కు బస్సు సర్వీస్   •   కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కట్టకొమ్ము తండా సర్పంచ్   •  

కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలకు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేయాలి

24-03-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, మార్చి 23 ( విజయక్రాంతి ) :కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉ త్సవాలకు వచ్చే భక్తులకు అన్ని విధాలా సౌ కర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కలిసి వివిధ శాఖల అధికారులతో శ్రీ చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లా డుతూఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు కొం డగట్టులో నిర్వహించనున్న ఉత్సవాలకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏ ర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

త్రాగునీరు, చలివేంద్రాలకు ప్రాధాన్యత

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇ వ్వాలని, భక్తులు ప్రయాణించే మార్గాల వెంట చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

పార్కింగ్, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు

వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం 7 వాహన పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తూ, నీడ, త్రాగునీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రాత్రి వేళల్లో సరిపడ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

దీక్ష భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

కాలి నడకన వచ్చే దీక్ష భక్తులకు ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేయాలని, మాల ధారణ తీసివేత, కేశ ఖండన, కోనేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కేశ ఖండన కేంద్రాలు, షవర్లు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

సీసీ కెమెరాలు, వైద్య సేవలు

భద్రత కోసం 64 సీసీ కెమెరాలను ఏర్పాట్లు, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

పారిశుద్ధ్యం, అగ్నిమాపక చర్యలు

ఉత్సవాల సమయంలో పరిశుభ్రతను కాపాడేందుకు అవసరం మేరకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని తెలిపారు. కోనేరులోని నీటిని శుభ్రపరచాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.

భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు

రాత్రివేళల్లో నడిచి వచ్చే భక్తులకు రేడియం స్టిక్కర్లు పంపిణీ చేయాలని, పోలీస్ కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

పరిపాలనా బాధ్యతలు

పారిశుధ్య పనులను జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని, కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి చూడాలని భక్తులకు ప్రసాదం అందించేందుకు తగిన సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, ఆర్డీవో పి. మధుసూధన్, ఆలయ ఈ.ఓ అంజనా రెడ్డి, వివిధ స్థాయిల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.