calender_icon.png 5 February, 2026 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏతో సమావేశం ఏర్పాటు చేయించండి

05-02-2026 01:32:30 AM

బీసీసీఐకి టీసీఏ విజ్ఞప్తి

హైదరాబాద్, ఫిబ్రవరి 4: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికై కృషి చేస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) బీసీసీఐకి లేఖ రా సింది. బాంబే హైకో ర్టు ఆదేశాలను అమ లు చేయాలని కోరుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సంయుక్త సమావేశం ఏర్పాటుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీతో పాటు హెచ్‌సీఏ సింగిల్ కమిటీ సభ్యులు జస్టిస్ పి నవీ న్ రావు(రిటైర్డ్), ప్రెసిడెంట్, సెక్రటరీ, సీఈవో మెయిల్ పంపింది. ఈ సమావేశంలో తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడమే ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.

తటస్థ వేదికపై సమావేశం నిర్వహించాలని, మొత్తం సమావేశం వీడియో, ఆడియో రూపంలో రికార్డింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. బాంబే హై కోర్టు ఆదేశాల ప్రకారం వచ్చే మూడు వారాల్లోపూ హెచ్‌సీఏ, టీసీఏ మధ్య స మావేశం జరిగేలా చూడాలని బీసీసీఐ సెక్రటరీని కోరింది. ఈ మీటింగ్‌కు సంబంధించి తేదీ ని నిర్ణయించాలని, ఏర్పాట్లు చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్న ట్టు టీసీఏ స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో క్రికెటర్లకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.