13 May, 2026 | 12:49 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

రెగ్యులర్ డీఈవోలను నియమించండి

07-01-2026 01:20 AM
  1. 33 జిల్లాలకు గాను ఐదారు జిల్లాలకు మాత్రమే ఉన్నారు

శాసన ండలిలో టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి 

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : రాష్ట్రంలో 33 జిల్లాలుంటే, కేవలం ఐదారుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలున్నారని, సీఈవోలు, అదనపు కలెక్టర్లకు జిల్లా పర్యవేక్షణ బాధ్యతలు ఇస్తున్నారని, ఇది విద్యాశాఖ నిబంధనలకు పూర్తి విరుద్దమని టీచర్ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. 70 మంది ఉప విద్యాధికారులు (డిప్యటీఈవోలు) ఉండాల్సి వస్తే అన్ని పోస్టులూ ఖాళీ గానే ఉన్నాయన్నారు. 600 మండలాలకు 13 మంది మాత్రమే ఎంఈవోలున్నారని, దీంతో స్కూల్ ప్రధానోపా ధ్యాయులకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపారు.

మంగళవారం శాసనమం డలిలో స్పెషల్ మెన్షన్స్‌లో భాగంగా పాఠశాల విద్యాశాఖపై ఆయన మాట్లాడారు. స్కూల్‌తో పాటు పర్యవేక్షణ చేయడం హెచ్‌ఎంకు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పది డైట్ కాలేజీల్లో 20 ఏళ్ల్లుగా ఒకే ఒక టీచర్ ఉన్నారని, టీచర్ తయారు చేసే కాలేజీలకే బోధించే అ ధ్యాపకులు లేకపోవడం దురదృష్టకరమన్నా రు. పదోన్నతులు కల్పించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరా రు.

అలాగే  రాష్ట్రంలో 1030 గురుకుల పా ఠశాలల్లో 650కిపైగా అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, ప్రభుత్వం 12 ఏళ్ళుగా దాదా పు రూ.3500 కోట్లు అద్దె రూపంలోనే చెల్లించిందని తెలిపారు. ఈ మొత్తంతో గురుకు లాలకు శాశ్వత భవనాలే నిర్మించి ఉం డొచ్చన్నారు. అద్దె భవనాల్లో అరకొర వసతులతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్లకు క్వార్టర్లతో కూడిన పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని, గురుకులాల టైంటేబుల్ మార్చాలని డిమాండ్ చేశారు. దీనికి మంత్రి దామో దర రాజనర్సింహా సమాధానమిస్తూ... టైం టేబుల్ మార్పుపై కమిటీ వేశామని తెలిపారు.