22 August, 2026 | 4:12 PM

కరత్వాడ అంగన్వాడి కేంద్రంలో టీచర్ను నియమించండి

22-08-2026 03:00 PM

బోథ్. ఆగస్ట్ 22 ( విజయక్రాంతి): మండలంలోని కరత్వాడ గ్రామంలో 36 మంది సున్నా నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని వారికి పౌష్టికాహారం అందాలంటే రెగ్యులర్ అంగన్వాడి టీచర్‎ని నియమించాలని గ్రామ సర్పంచ్ దుర్వా విశ్వేశ్వర్ కోరారు. అంగన్వాడి కేంద్రంలో టీచర్ లేకపోవడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వపరంగా మంజూరు అవుతున్న పౌష్టికాహారం ఆశించిన స్థాయిలో అందకుండా పోతున్నదని వాపోయారు. గతంలో విధులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్ పదవీ విరమణ పొందగా ఆయా వ్యక్తిగత కారణాలవల్ల విధులకు రాకుండా పోయిందన్నారు. 36 మంది చిన్నారులతో పాటు ముగ్గురు గర్భిణీలు ఇద్దరు బాలింతలు ఉన్నారన్నారు. అయితే అంగన్వాడీ టీచర్ నియామకం పైన గతంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువచ్చామని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరలో గ్రామంలో ఉన్న కేంద్రంలో అంగన్వాడి టీచర్ నియమించాలని కోరారు.