ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం
చేగుంట -మెదక్ రోడ్డు లొ (ఆర్ ఓ బి )నిర్మాణ పనులు
వాహనదారులకు తూప్రాన్ డీఎస్పీ అవగాహన
చేగుంట ఆగస్ట్ 22,విజయక్రాంతి: చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లొ మండలంలోని వివిధ గ్రామల ప్రజలతోపాటు,వివిధ పరిశ్రమల ప్రతినిధులతో చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, సిఐ సైదా నాయక్ అధ్యక్షతన ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూప్రాన్ డి ఎస్పీ నరేందర్ గౌడ్ హాజరయ్యారు.
రేపటి నుండి ప్రారంభం కానున్న ఆర్ఓబి పనుల ద్వారా వాహనాలు,చేగుంట నుండి చిన్న శంకరంపేట్ పరిశ్రమలకు వెళ్లే వాహనాలు అదేవిధంగా మెదక్ వెళ్లే వాహనాలు వెళ్లే రూట్లను ప్రజలకు వివరించారు. సుమారు రెండు సంవత్సరాల పాటు కొనసాగుతున్న ఈ పనుల ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని డిఎస్పి నరేందర్ గౌడ్ పరిశ్రమల ప్రతినిధులకు ప్రజలకు సూచించారు, ఈ కార్యక్రమంలో పోలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మి,వడియారం సర్పంచ్ సాయి కుమార్ గౌడ్, నాయకులు కొండి స్వామి తోపాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.






