రీ సర్వే పనులు వేగంగా పూర్తి చేయాలి
- ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పంటల మార్పిడి చేపట్టాలి
- ప్రీ-ప్రైమరీ ప్రవేశాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలి
- కలెక్టర్ అంకిత్
పాల్వంచ, జూలై 17, (విజయక్రాంతి): భూ రీ సర్వే పనులు వేగవంతం చేయాలని, ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనే పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నా రు. శుక్రవారం పాల్వంచ మండలంలో వి స్తృతంగా పర్యటించి సారేకల్లు గ్రామంలో భూ రీ-సర్వే పనులను పరిశీలించారు. అనంతరం కోడిపుంజుల వాగు గ్రామంలో వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్నీ నో ప్రభావంపై రైతుల అవగాహన సదస్సు లో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశా రు. అనంతరం కరకవాగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చే సి విద్యా ప్రమాణాలు, ప్రీ-ప్రైమరీ ప్రవేశాల పై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశా రు.
సారేకల్లు గ్రామపంచాయతీ పరిధిలో కొ నసాగుతున్న భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులను పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన భూ రీ-సర్వే కార్యక్రమం ద్వా రా భూముల హద్దులు ఖచ్చితంగా నిర్ధారించబడటంతో పాటు భూ రికార్డులు నవీ కరించబడతాయన్నారు. దీనివల్ల భూ వివాదాల పరిష్కారానికి దోహదపడటంతో పా టు భూ యజమానులకు పారదర్శకమైన రి కార్డులు అందుబాటులోకి వస్తాయన్నారు.
అధికారులు సారేకల్లు గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 28 సర్వే నంబర్లలో 84 ఎకరాల మేర భూ రీ-సర్వే కొనసాగుతోందని, రెండు రోజుల్లో పూర్తి చేస్తామని క లెక్టర్కు వివరించారు. అనంతరం కోడిపుంజుల వాగు గ్రామంలో నిర్వహించిన అవ గాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్నీనో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గడంతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకా శం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి చేపట్టాలని సూచించారు.
అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు, కంది, పెసర, మినుము, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. కరకవాగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి, ప్రతిరోజూ నాణ్యమైన, పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఐదో తరగతి విద్యార్థు లతో ఇంగ్లీష్లో మాట్లాడించి వారి భాషా నైపుణ్యాలను పరీక్షించారు. రెండు రోజుల్లో ప్రీ-ప్రైమరీ ప్రవేశాలను పూర్తి చేయాలని సం బంధిత అధికారులను ఆదేశించారు. ఈ కా ర్యక్రమాల్లో కొత్తగూడెం ఆర్డీవో మధు, పాల్వంచ తహసీల్దార్ ధారాప్రసాద్, కోడిపుంజుల వాగు గ్రామ సర్పంచ్ మహేశ్వరి, సర్వే అధికారులు, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






