23 March, 2026 | 4:40 PM

అంకెల గారడీ తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు

23-03-2026 12:00 AM

వేములపల్లి, మార్చి 22  : ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడి చేస్తూ కాలాన్ని వెల్లబుచ్చుతోందని బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ అన్నారు. ఆదివారం శెట్టిపాలెం గ్రామంలో సర్పంచ్ పెదపంగా సైదులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మభ్య పెట్టడమే కాకుండా అంకెల గారడీ చేస్తుందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 28 నెలలు పూర్తి అయినప్పటికీ మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆశాజనకంగా లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలకు చట్టబద్రత కల్పించి శాసనసభ శాసనమండలిలో ప్రైవేటు బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మహిళలకు 2500 వృద్ధులకు బీడీ కార్మికులకు 4000 పింఛను దివ్యాంగులకు 6000 రూపాయలు పెన్షన్ అలాగే విద్యార్థినులకు స్కూటీ ఆటో కార్మికులకు ఒక సంవత్సరమునకు 12 వేల రూపాయలు నిరుద్యోగ భృతి రైతు భరోసా పండిన పంటకు 500 రూపాయల బోనస్ ఒంటరి మహిళలకు వితంతువులకు 4000 పెన్షన్ 500 రూపాయలకే గ్యాస్ బండ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటిని వెంటనే ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకు వెంటనే అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ సుధాకర్ రెడ్డి, కాట్రగడ్డ రాజగోపాల్ రావు, చంటి చంటి, కట్టామట్టమ్మ, దుర్గమ్మ, కవిత తదితరులు పాల్గొన్నారు.