25 April, 2026 | 4:01 AM

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మరో ఆర్టీసీ డ్రైవర్

25-04-2026 02:06 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): భూపాలపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ వర్కోలు రవీందర్ గురువారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న డ్రైవర్  రవీందర్ను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.

వంగపాడు గ్రామానికి చెందిన రవీందర్ కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు ప్రచారం సాగుతోంది. నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సమ్మెలో పాల్గొని మనస్థాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకుని ఆత్మహత్య చేసుకోగా, మరో డ్రైవర్ గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేపుతోంది.