యువత స్వశక్తితో ఎదగాలి
చేగుంట, గుంట పట్టణ కేంద్రం లొ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్, భాస్కర్, మెదక్ రోడ్డు లొ నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ ప్లేస్ మెడికల్ షాప్ ను , దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగల్ రావు, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వడియారం సర్పంచ్ సాయికుమార్, శుక్రవారం కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వసక్తితో ఎదగడం ముఖ్యమని నలుగురికి ఉపాధి అవకాశం కల్పించి జీవించడంలో ఆనందం ఉంటుందని తెలిపారు.
పట్టణ ప్రజలకు మందులు తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని, డోర్ డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉన్నదని, పట్టణ, పరిసరాల ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని,షాప్ యజమాని నవీన్ కుమార్, భాస్కర్ తెలిపారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, కాషాబోయిన శ్రీనివాస్, బల్ రెడ్డి, స్టాలిన్ నర్సిములు,పలువురు ఉపసర్పంచ్ రఫీ, చౌదరి శ్రీనివాస్,, వార్డు సభ్యులు మండల నాయకులు సండ్రుగు శ్రీకాంత్, రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






