24 July, 2026 | 10:23 PM

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

24-07-2026 09:39 PM

మహబూబ్ నగర్,(విజయ క్రాంతి): న్టిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అటానమస్ కళాశాలలో 2026-27  విద్యా సంవత్సరానికి ఇంగ్లీష్, హిందీ ,  సంస్కృతం ,అరబిక్ ,తెలుగు, కామర్స్, బి .ఎఫ్. ఎస్.ఐ, కంప్యూటర్స్ సైన్స్, అప్లికేషన్, అప్లైడ్ న్యూట్రిషన్ , బయోటెక్నాలజీ, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్,  జువాలాజి,  హెల్త్ కేర్, హిస్టరీ ,పొలిటికల్ సైన్స్,  ఎకనామిక్స్ ఉర్దూ మీడియం, పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియం, సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల(గెస్ట్ ఫ్యాకల్టీ)  కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్    అమీనా ముంతాజ్ జహాన్ తెలిపారు.

అభ్యర్థులు పీజీ   (పోస్ట్ గ్రాడ్యుయేషన్)లో సంబంధిత సబ్జెక్టులో 55% శాతం మార్కులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి, నెట్,  స్లెట్,  సెట్, పి హెచ్ డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఫై  సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునేవారు,  అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఈ నెల 27 వ తేది సాయంత్రం నాలుగు గంటల లోపు యన్ టి ఆర్  ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మహబుబూనగర్  ఆఫిస్ లో దరఖాస్తు చేసుకోవాలి . దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో, ఈ నెల 28 న ఉదయం  10:00 గంటలకు ఎన్. టి. ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అ), మహబుబూనగర్ లో  ఇంటర్వ్యూ  (మౌఖిక పరీక్ష,  డేమో) కు హాజరు కావాలని, కళాశాల  ఇంచార్జ్  ప్రిన్సిపాల్  అమీనా ముంతాజ్ జహాన్  తేలియజేశారు.