8 April, 2026 | 4:59 AM

వేసవిలో తాగునీరు ఎద్దడి లేకుండా చూడాలి

08-04-2026 01:16 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట ఏప్రిల్ 7 (విజయక్రాంతి) :  జిల్లాలో వేసవిలో త్రాగు నీరు ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం వి సి కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులతో వివిధ శాఖల పనితీరు, చేపట్టవలసిన పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని రకాల సామగ్రిని టీపీ సెంటర్లలో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి, రైతులకు మెరుగైన సేవలు అందించాలనీ సూచించారు.

ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల అందరికీ ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు తీసుకోవాలన్నారు. నర్సరీలల్లో వంద శాతం మొలకలు వుండేలా చూడాలని. నర్సరీలకు షేడ్ నెట్ లు ఏర్పాటు చేయాలని, అన్నీ రకాల రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిఎస్‌ఓ మోహన్ బాబు, సిపిఓ కిషన్, డిపిఓ యాదగిరి ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.