అన్న బాహు సాఠే విగ్రహం ఆవిష్కరణ
భైంసా ఆగస్టు 30 ( విజయ క్రాంతి)భైంసా మండలం సుంక్లి గ్రామంలో సాహిత్య సామ్రాట్ శ్రీ అన్న బాహు సాఠే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అన్న బాహు సాఠే విగ్రహాన్ని ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ఆవిష్కరించారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ అన్నభౌ సాఠే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన రచనలు, కవితల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు.అన్న బాహు సాఠే రచనలు సా మాజిక అసమానతలపై పోరాటానికి స్ఫూర్తినిచ్చాయని,
అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలోని పేద, బడుగు, బలహీన వ ర్గాల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు.సుంక్లి గ్రామ అ భివృద్ధికి ఇప్పటికే సుమారు రూ.80 లక్షల వరకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.
ఈ నిధులతో గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పి స్తామని చెప్పారు. రానున్న రోజుల్లో బిజ్జూర్ నుండి పెంచికల్ పాడ్ వయ సుంక్లి బీటీ రోడ్డు, మరియు వంతెన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని అలాగే వానల్ పాడ్ నుండి వంజర్ రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.






