8 July, 2026 | 4:37 AM

సికింద్రాబాద్‌లో అనుమతులు లేకుండా వైన్ తయారీ

08-07-2026 12:00 AM

రూ.50 వేల విలువైన వైన్ స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్

సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని తార్నాక,మెట్టుగూడ ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో సికింద్రాబాద్ డీటీ ఎఫ్ సీఐ సౌజన్య ఆధ్వర్యంలోని ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్ళగా తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి సమీపంలో నిర్వహించిన దాడిలో 20 లీటర్ల వైన్ను స్వాధీనం చేసుకుని వేణు, ప్రకాష్లను అరెస్టు చేశారు.

రెండు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వైన్ విలువ సుమారు రూ.50 వేలుగా ఉంటుందని అధికారులు తెలియజేశారు. అలాగేమెట్టుగూడలోని ఇంటి నెం. 12-7-190 లో నిర్వహించిన తనిఖీల్లో 25 వైన్ బాటిళ్లను స్వా ధీనం చేసుకుని ఆంటోని అనే వ్యక్తిని అరెస్టు చేశారు.స్వాధీనం చేసుకున్న వైన్తో పాటు నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.