7 June, 2026 | 1:23 AM

మెడికవర్ వైద్యుల ఘనత

07-06-2026 12:00 AM

75 ఏళ్ల వృద్ధుడికి మోకాళ్ల మార్పిడి.. 

మంచానికే పరిమితమైన వ్యక్తిని మళ్లీ నడిపించారు

వయసు పెరిగిందంటే నడవడం కష్టమే, నొప్పితో జీవించాల్సిందే అనే అపోహలను చెరిపేస్తూ, 75 ఏళ్ల వృద్ధుడికి రెండు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్ వైద్యులు ఆయనకు మళ్లీ స్వతంత్రంగా నడిచే ఆనందాన్ని అందించారు.

హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్ర గత కొన్ని సంవత్సరాలుగా రెండు మోకాళ్లలో తీవ్రమైన ఆస్టియోఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. పరిస్థితి క్రమంగా విష మించడంతో నడవడం, మెట్లు ఎక్క డం, కుర్చీ నుంచి లేవడం వంటి సాధారణ పనులు కూడా తీవ్ర నొప్పితో కూడినవిగా మారాయి. వయసు అధికంగా ఉండటం, థైరాయిడ్ సమస్యతో పాటు గతంలో స్ట్రోక్ రావడం వల్ల శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఆయన వెనుకంజ వేశారు.

సమగ్ర వైద్య పరీక్షలు, ఆరోగ్య పరిస్థితుల సమన్వ యంతో మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా. శశివర్ధన్ నేతృత్వంలోని బృందం రెండు మోకా ళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. శస్త్రచికిత్స అనం తరం మొదటి రోజే రాఘవేంద్రను నిలబెట్టి పూర్తి బరువుతో నడిపించారు. ప్రత్యేక ఫిజియోథెరపీ, పున రావాస చికిత్సతో ఆయన కోలుకునే ప్రక్రియ వేగంగా సాగింది. కేవలం నెలరోజుల్లోనే ఎలాంటి సహాయక పరికరం లేకుండా స్వయంగా నడిచే స్థితికి చేరుకుని తన రోజువారీ కార్యకలాపాలను స్వతంత్రంగా నిర్వహి స్తున్నారు.

ఈ సందర్భంగా తనకు అందిన కొత్త జీవితానికి కృతజ్ఞతగా, కోలుకునే సమయంలో ఉపయోగించిన వాకర్‌ను మరొక రోగికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి విరాళంగా అందించడం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది.

డా. శశివర్ధన్ మాట్లాడుతూ.. వయ సు ఎక్కువైందనే కారణంతో చాలా మంది మోకాళ్ల నొప్పిని భరిస్తూ జీవిస్తున్నారు. ఆధునిక జాయింట్ రీప్లేస్మెంట్ టెక్నాలజీ, మెరుగైన నొప్పి నియంత్రణ విధానాలు, త్వరితగతిన నడక ప్రారంభించే ప్రోటోకాల్స్, వ్యక్తిగత పునరావాస చికిత్సల వల్ల వృద్ధాప్యంలో కూడా అద్భుత ఫలితా లు సాధ్యమవుతున్నాయి. తీవ్రమైన మోకాళ్ల నొప్పిని వయసు సహజ లక్షణంగా భావించకుండా సరైన సమ యంలో ఆర్థోపెడిక్ నిపుణులను సం ప్రదించడం ఎంతో ముఖ్యం అని తెలిపారు. కార్యక్రమంలో సెంటర్ హెడ్ మల్లేశ్ పాల్గొన్నారు.