7 June, 2026 | 2:37 AM

ధాన్యం కొనుగోలులో సర్కార్ విఫలం

07-06-2026 01:15 AM

తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బీఆర్‌ఎస్ ధర్నా 

భిక్కనూర్, జూన్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు శనివారం ధర్నా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు, తరలింపు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మండలంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లపై పూర్తి వివరాలు వెల్లడించాలని తహసీల్దార్‌ను డిమాండ్ చేశారు.ధర్నా సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి తహసీల్దార్ సునీతతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని 48 గంటల్లో పూర్తిగా తరలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.