1 September, 2026 | 10:09 PM

Breaking News

అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •   నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు   •  

తాడిచర్లలో ఏఎంఆర్ కంపెనీ నిర్లక్ష్యం… ప్రాణాలతో చెలగాటం

01-09-2026 | 07:45pm

భారీ వాహనాలతో ప్రధాన రహదారి ఛిద్రం.. గుంతల్లో ప్రయాణికుల ప్రాణాలు

రోడ్డు పాడుచేసి పట్టించుకోని యాజమాన్యంపై గ్రామస్తుల మండిపాటు

మంథని, మల్హర్,(విజయ క్రాంతి): పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ మల్హర్ మండలం తాడిచర్ల లోని ఏఎంఆర్ కంపెనీకి సంబంధించిన భారీ వాహనాల రాకపోకలతో తాటిచర్ల నుంచి ఖమ్మంపల్లి, కొయ్యూరు కు పెద్దతుండ్ల, చిన్నతుండ్ల కు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ఛిద్రమైంది. అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడి రహదారి ప్రమాదకరంగా మారినా, వాటిని పూడ్చడంలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గ్రామస్తులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వందలాది భారీ వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తూ రోడ్డును పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కార్లు, ద్విచక్ర వాహనాలు సైతం సజావుగా వెళ్లలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూపాలపల్లి–మంథని మార్గానికి కీలకంగా ఉన్న ఈ రహదారిపై గోదావరిఖని కోల్‌బెల్ట్ ప్రాంతం నుంచి పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి, తాటిచెర్ల వైపు వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. రద్దీ పెరిగినా, రోడ్డు మరమ్మతులు చేపట్టకుండా ఏఎంఆర్ కంపెనీ యాజమాన్యం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

రోడ్డును ధ్వంసం చేసిన వాహనాలు కంపెనీవే.. కానీ గుంతలు పూడ్చే బాధ్యత మాత్రం మాదికాదన్నట్లుగా యాజమాన్యం వ్యవహరిస్తోందని గ్రామస్తులు మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి తక్షణమే గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఎంఆర్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు, ప్రయాణికులతో కలిసి పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.