1 September, 2026 | 10:08 PM

Breaking News

అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •   నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు   •  

ఈ నెల 5న నకిరేకల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

01-09-2026 | 07:42pm

మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ

చిట్యాల,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 5న (శనివారం) నకిరేకల్‌లో(Nakirekal) పర్యటించనున్న నేపథ్యంలో మినీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, వివిధ శాఖల అధికారులు మంగళవారం పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, పార్కింగ్, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుందని, గత విధ్వంసక పాలన నుంచి తెలంగాణ వికాసం వైపు ముందుకు సాగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరగనున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఎమ్మెల్యే విమర్శించారు.

డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, ప్రతి కుటుంబానికి మూడెకరాల భూమి వంటి హామీలను గత ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం పర్యటన కీలకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే సభకు నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు.