1 September, 2026 | 10:08 PM

Breaking News

అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •   చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం   •   నేరేడుచర్ల పిహెచ్సిలో మూడు గంటల వ్యవధిలో రెండు సాధారణ ప్రసవాలు   •  

కోదాడ మాజీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్‌ నేత రావెళ్ల కృష్ణారావు ధ్వజం

01-09-2026 | 07:50pm

కోదాడ: కోదాడ(Kodada) మాజీ ఎమ్మెల్యే బొల్లంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రావెళ్ల కృష్ణారావు(Congress leader Ravella Krishna Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) నాయకులు పద్మావతి రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన మంగళవారం తీవ్రంగా ఖండించారు. రూ.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలు నిజమా? కాదా? అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయాలని రావెళ్ల కృష్ణారావు డిమాండ్‌ చేశారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాజీ ఎమ్మెల్యేపై ఉందన్నారు.

ఆరోపణలకు సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు కాకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే ముందుగా తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పి, అనంతరం కాంగ్రెస్‌ నాయకులపై మాట్లాడాలని రావెళ్ల కృష్ణారావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని, పార్టీ శ్రేణులు ఐక్యంగా ఎదుర్కొంటాయని ఆయన స్పష్టం చేశారు.