1 September, 2026 | 11:41 PM

ఆర్చరీ సెలక్షన్స్‌ లో 12 మంది ఎంపిక

01-09-2026 | 10:08pm

నిర్మల్,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలలకు క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అరిచారు పోటీలకు 12 మంది ఎంపికయ్యారని గిరిజన ఆశ్రమ పాఠశాల(Tribal Ashram School) ప్రధానోపాధ్యాయులు అనూష వ్యాయామ ఉపాధ్యాయుడు రమేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 75 మంది విద్యార్థులు(Students) సెలక్షన్స్‌ కు హాజరయ్యారు. బాలికల విభాగంలో కడెం మండలం అల్లంపల్లి జీఆర్‌ గురుకుల పాఠశాలకు చెందిన నిహారిక, మీనాక్షి, రజిత, ఆదిలాబాద్ జిల్లా చించుఘాట్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన శ్రీజ, రామలక్ష్మి, రూప ఎంపికయ్యారు.

బాలుర విభాగంలో డ్యాంగాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన రంజిత్ సింగ్, కరణ్, తరుణ్, కడెం మండలం అల్లంపల్లి జీఆర్‌ గురుకుల పాఠశాలకు చెందిన జగన్, సునీల్, సుశాంత్ ఎంపికయ్యారు. ఎంపికైన 12 మంది క్రీడాకారులు ఈ నెల 6న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నిహారిక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనూష,  ఆర్చరీ కార్యదర్శి అంబేద్కర్, పీఈటీలు గంగన్న, జ్యోతి, వందన, వినోద్, కోచ్‌లు జగదీర్‌రావు, జైతూ అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.