చర్లలో 48 గంటల రిలే దీక్షలు ప్రారంభం
చర్ల,(విజయక్రాంతి): ఏజెన్సీలో ఆదివాసీ మహిళలపై(Tribal women) జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ గోండ్వానా సంక్షేమ పరిషత్(Gondwana Welfare Council) ఆధ్వర్యంలో 48 గంటల రిలే దీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. చర్ల మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం(Komaram Bheem statue) వద్ద ఉభయ రాష్ట్రాల కన్వీనర్ సొందే వీరయ్య దీక్షలను ప్రారంభించారు. అంతకు ముందు ఉయక శిరీషకు నివాళిగా మౌనం పాటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ మహిళలే లక్ష్యంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, దోషులపై కఠిన చట్టాలు తేవాలన్నారు. ఏజెన్సీ చట్టాల పరిరక్షణకు యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు బీరబోయిన శేఖర్, నాయకులు గొంది లీలాప్రసాద్, బీరబోయిన అరుణ, ఇరప అంజిబాబు, కాయం శ్రీనివాసరావు, పాయం సన్యాసి, ముమ్మినేని అరవింద్, సిహెచ్. రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.






