3 July, 2026 | 8:46 PM

Breaking News

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •  

అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

14-04-2026 03:23 PM

పటాన్ చెరు: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పునస్కరించుకొని మంగళవారం ఉదయం పటాన్‌చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మెయిన్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీనగర్ డివిజన్‌లోని మ్యాక్ సొసైటీ ఈ ఎస్ ఐ రోడ్ మరియు మ్యాక్ సొసైటీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి పటాన్‌చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి  హాజరై పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి  మాట్లాడుతూ... సమానత్వం, సామాజిక న్యాయం కోసం డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్  గౌరవార్థం 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించిందని, అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విగ్రహాన్ని మూసివేసి ఉంచడం బాధాకరమని అన్నారు.