అంబేద్కర్ చేసిన కృషి స్ఫూర్తిదాయకం
ఆ మహనీయుడి ఆశయాలను నేటితరం కొనసాగించాలి
రాజ్యాంగ నిర్మాత కలలుగన్న సమ సమాజ స్థాపన దిశగా సిఎం రేవంత్ పాలన
నీలం మధు ముదిరాజ
చిట్కుల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పటాన్ చెరు: సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికీ స్ఫూర్తిదాయకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడు చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి, అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని అన్నారు. ప్రజలంతా మొదట విద్యావంతులైతేనే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మి ఆ దిశగా కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు.
స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం అందరికీ దక్కేలా రాజ్యాంగ రూపకల్పన చేశారని తెలిపారు. ఆయన కల్పించిన హక్కుల తోనే నేడు మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కుల మత అసమానతలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని అంబేద్కర్ కలలుగన్నారని నేడు ఆ కలలను నిజం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నాడన్నారు. ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కోరారు.






