3 July, 2026 | 9:37 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ నేతల ఘన నివాళులు

14-04-2026 03:21 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): బీజేపీ మండల అధ్యక్షుడు భట్టు రమేష్ ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి అందించిన రాజ్యాంగ సేవలను స్మరించుకున్నారు. భట్టు రమేష్ మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, గొప్ప రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా దేశ సేవలో నిలిచారని పేర్కొన్నారు.